9′s radium balls 

This has been pending since “ages”. Today, I finally was able to write down the transcript of 9′s “farewell speech”. I actually had the intention of doing that for all the speeches, since a long time. But, you know, the lazy ass that I am. But, since 9′s is my favorite, I thought of doing at least that.

Also, as luck would have it, everybody’s speech was recorded on Ringo’s comp, but not 9′s! and the other recorder that I had, also failed to start at the right time. I do not have the initial part of 9′s speech. Sorry.:’(
[It starts with something like 9's daughter (10th class) and his boyfriend coming home. If I remember correctly(don't trust it too, much), 9 asks his daughter's boyfriend how's life going on and what he wants to study next? The conversation somehow leading to 9's college days..]

“the adventures of kopparapu sunil kumar” అని ఒక biography రాస్తూ, దాన్ని edit చేస్తూ compలో, పంచ్గాడితో chat చేస్తూ ఉన్నా అన్నమాట. అదే timeలో, my daughter came home with her boyfriend. అంటే మా daughter అప్పుడు 10th standard అనుకుంట, ఒక 14years age ఉంటదేమో..
so, అప్పుడు ఏమైందంటే, 10standard ఐపొయినట్టుంది, so next ఏమి చెయ్యాలి, ఇది , అది full tension గున్నారు.. మా daughter boyfriend వొచ్చి నన్ను అడిగాడు అనమాట..
“అంకుల్ మీరు మీ timeలో ఏమి చేసారు అంటే..”
నేను చెప్పాను, “ఎందుకు బాబూ గుర్తు చేస్తావ్, అవొక wonderful days of my life అని.. ‘the salad days of my life, when my judgement was green and my blood was cold’ “అని Shakespeare quote ఒకటి కొట్టానన్నమాట. వాడు నా quote అనుకుని confuse అయ్యి, fan ఐపోయాడు నాకు తరవాత. తర్వాత మా అమ్మాయి చెప్పింది లెండి, అది, Shakespeare quote అని.
నేను నా story చెప్పడం మొదలుపెట్టగానే, మా అమ్మాయి తల బాదుకుంటూ పక్కకి వెళ్ళి పోయింది, “అబ్బా మళ్ళీ మొదలెట్టాడ్రా” అని.
మొత్తానికి అలా ఒకొక్క characteru వర్ణించుకుంటు వస్తున్నాను, నా… జరిగిన 4yearsలో
“మొత్తం 4yearsu, normalగానే జరిగింది. అంటే ఎంత వచ్చినప్పుడు ఎదో ఊడపీకేద్దాం, పొడిచెద్దాం అని వొచ్చినా ఎక్కడ.. హ హ.. అన్నీ మాటల వరికే ఐపోయాయి.. అంతా normalగానే జరిగింది.”
“మరి ఇప్పుడు ఎలా uncle మీరు ఇంత great ఐపోయారు, మీకు ఇంత్ మంది fans ఎలా,ఇది ,అది..” అని వాడు అడిగాడు.
అప్పుడు చెప్పాను,‌”ఎప్పుడు మాటలవరికే ఐపోయాయి రా బాబు,కుర్చుంటాం, meetingలు పెట్టుకుంటాం, discussionలు చేస్కుంటాం, అంతే ఐపొయింది, దాని తర్వాత .. ఎవ్వడికి.. అంటే, చెద్దాం అన్న ఇది ఉన్నా కూడా, ఎప్పుడు మేము ఏమి చెయ్యలేదు, ఒక్క రోజు ఏదో flukeలో  idea వేసాను,ఇలా farewell, ఇంక last వెళ్లిపోతున్నాం కద.. ఎవడైనా మంచిగా మాట్లాడితే , ఇంక  ఎప్పటికి  గుర్తుండిపొతుంది  అని…”
“అప్పుడు… ఆరోజు… correctగా date గుర్తులేదునాకు..”
“అమ్మా, అప్పుడు ముంబయి massacre అయ్యింది చూడు, అది ఎప్పుడమ్మా,” అని మా అమ్మాయిని అడిగాను.
మా అమ్మాయి చెప్పలెపోయింది.. అంటే.. naturalగా.. నా కుతురు కద, పెద్దగా dateలేం గుర్తుండవు..
“ఆ.. పోని obama వొచ్చాడు, ఆ time ఎదైనా గుర్తుందా..” అంటే, అది కూడా చెప్పలేపోయింది.
సర్లే లైటు తీస్కోమని, “పోని బోజా అంకుల్ birthday ఎప్పుడమ్మా?” అని అడిగాను. ఠక్కున చెప్పింది, “10th” అని.
“అదే  ఆ ముందు రోజే  నాన్నా, అంటే 9th night, మెమందరం కూర్చోని ఉన్నాం, ఇలా అందరు ఎమైనా మాట్లాడితే బావుంటుందని idea వొచ్చి ఆ రోజు అందర్ని పిలిచాను”
“ఆ రోజు మా friendsలో ఒక్కొక్కొడు మాట్లాడినదానికి, ఇంక మాలో ఎవ్వరం తిరిగి చూడ లేదు. ఏదో నేల మీద bounce అవ్తున్న radium ball లాగా, ఆ మాటలు ఇప్పడికి నా తల లో  bouce అవుతూ ఉంటాయి. అవి ఎప్పడికి నేను ఇంక మర్చిపోలేదు. అవే నన్ను ఇఓత దూరం ఇలా drive చేస్తూ ..” {ప్ర స్తుతానికి out-of-the-character, అలాంటి speech, already మనం ఒకటి విన్నాం, ఇంకా చాలా వింటాం అని ఆశిస్తూ..} “so, అలాంటి ఒక idea, flukeలో రావడం వల్ల …ఇప్పుడు నువ్వు చూశావు, బోజా అంకుల్, రింగో అంకుల్, వీళ్ళందరు గొప్ప music directors, singers, అలాగే మన్ యూసీ అంకుల్, దాము  అంకుల్, చైతన్యా అంకుల్, వందిత్ అంకుల్ , మన బాబా గారు, ఇంక  పంచ్  అంకుల్  తెలుసు  కద  పక్కింట్లోనే  ఉంటారు, ఇలా  అందరూ చూశావు గా ఎంత …”
“పైగా  మేము  graduate ఐన టైములో , నాకు  బాగ్గుర్తు, చాలా economic crisisu, terrorist attacksu, అసలు భయంకరంగా ఉండింది  పరిస్థితి .. ఏదో  ఒకటి చేసి.. మోత్తానికి.. “
“దాము ఎప్పుడు అంటు ఉండే వాడు, ‘ఏందిరా  బై , గొర్రెల్లాగా, అందరు వెళ్ళే దారి లో వెళ్తారు ,’అని. అలాగే దామూ నిరూపించు కున్నాడు, వాడు, వాడి సొంత దారి లొ వెళ్ళి, ఇప్పుడు మీకు తెలుసు, వాడు Indiaలో ఎంత  famousఓ…”
“అలా అందరూ  ఎవరి దారుల్లో వాళ్ళు వెళ్ళి, ఇప్పుడు ఈ positionలో ఉన్నాం. అంటే మేము ఏదో గోప్ప, అని గొప్పలు చెప్పెస్కోవట్లేదు,…”
“speech మరి పెద్దది  ఎయ్యే లోపు నేను ముగించు కోవడం betteru, అదయ్యా  matteru, those were the salad days of my life, so,.. మీ  ఇష్టం మీ choice మీది, నేను కూడా అప్పుడు గొరెల్లో  ఒకడ్నే, engineering తీస్కున్నప్పుడు, కాకపోతే  ఆ నాలుగేళ్లూ నాకు చాలా నేర్పించాయి.. అది నేను engineeringగా చూడను.. అదొక.. నేను నేర్చుకున్నది  electronics and instrumentation మాత్రం కాదు, కాపోతే చాలా.. అంటే.. education is a social process; education is growth; education is not preparation for life, but, life itself, అంటారు. అలా ఆ నాలుగేళ్ళూ ఇక్కడి దాకా నడిపాయి… “
“so.. choice is yours!”

It wasn’t very easy, but I have tried my level-best to reproduce it as accurately as I could. Kindly point out and correct any errors that may have crept in due to my negligence or other reasons.

ps: 9, I didn’t know if you would like this to be a Public post. Hence posting it privately. Make it public, if it’s okay with you.

Edit1: The post is now Public.
Edit2: It was my bad. This recording was rightly numbered 9, but I didn’t find it in the sequence in which the speeches were given. When Voodoo told he had the recording, only then my tube-light lit up! Extremely sorry for all the inconvenience and confusion created. Edited the Transcript.